Skip to main content

ఏపీ ప్రభుత్వ సలహాదారుగా అంబటి కృష్ణారెడ్డి నియామకం

 ఏపీ ప్రభుత్వానికి మరో సలహాదారు నియామకం జరిగింది. కొత్తగా అంబటి కృష్ణారెడ్డిని ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. నూతనంగా నియమితులైన అంబటి కృష్ణారెడ్డి వ్యవసాయ రంగానికి సంబంధించిన అంశాలపై సర్కారుకు సలహాలు, సూచనలు అందిస్తారు. అంబటి రెండేళ్లపాటు ఈ పదవిలో కొనసాగన్నారు. ఈ పదవికి కేబినెట్ హోదా కల్పించారు.

Comments