Skip to main content

రాజధానిపై వచ్చేనెల 21వరకు స్టేటస్‌ కో

 



రాజధాని అంశాలకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. వచ్చే నెల 21 నుంచి రోజు వారీ విచారణపై న్యాయవాదులతో ధర్మాసనం చర్చించింది. భౌతిక దూరం పాటిస్తే హైకోర్టులోనే విచారణ జరిపేందుకు సిద్ధమని త్రిసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. రాజధాని, సీఆర్డీఏ చట్టం రద్దుపై  గతంలో హైకోర్టు ఇచ్చిన స్టేటస్‌ కో ఉత్తర్వులు ఇవాళ్టితో ముగిశాయి. దీంతో సెప్టెంబరు 21 వరకు స్టేటస్‌ కో అమలు గడువును పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రాజధాని బిల్లులు అమలు చేయకుండా స్టేటస్‌ కో కొనసాగుతుందని ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణ సెప్టెంబరు 21కి వాయిదా వేసింది.

విచారణ సందర్భంగా పిటిషనర్‌ తరఫు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది నితీశ్‌ గుప్తా కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. విశాఖలోని కాపులుప్పాడలో రాష్ట్ర ప్రభుత్వం భారీ అతిథిగృహాన్ని నిర్మించ తలపెట్టిందని, స్టేటస్‌ కో అమల్లో ఉన్నప్పుడు అతిథిగృహ నిర్మాణానికి శంకుస్థాపన ఏంటని పిటిషనర్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. కార్యనిర్వాహక రాజధాని తరలింపులో ఇది కూడా భాగమేనని వాదనలు వినిపించారు. రాష్ట్రపతి భవన్‌ 5 ఎకరాల్లో ఉండగా.. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో 30 ఎకరాల్లో అతిథిగృహం నిర్మించడమేంటని ప్రశ్నించారు. దీనిపై సెప్టెంబరు 10వ తేదీ లోపు కౌంటరు దాఖలు చేయాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది.  రైతులు, ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు ఇప్పటి వరకు మొత్తం 70 పిటిషన్లు దాఖలు చేశారు. అన్ని పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. 

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here