విశాఖలో నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ గెస్ట్ హౌస్ కోసం ఏపీ సర్కారు 30 ఎకరాలు కేటాయిస్తూ జీవో జారీ చేసింది. భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో కాపులుప్పాడ గ్రేహౌండ్ భూముల్లో ఈ గెస్ట్ హౌస్ ను నిర్మిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రతిపాదిత అతిథి గృహం నిర్మాణం కోసం భూ రికార్డులు సిద్ధం చేయాలంటూ విశాఖ జిల్లా కలెక్టర్ కు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. అత్యవసర ప్రాతిపదికన నిర్మాణం జరపాలంటూ జీవోలో పేర్కొన్నారు. కాగా, ఈ భారీ గెస్ట్ హౌస్ నిర్మాణం బాధ్యతలను ప్రభుత్వం వీఎంఆర్డీఏ (విశాఖ మహానగర ప్రాంత అభివృద్ధి సంస్థ)కి అప్పగించింది. దీనిపై వీఎంఆర్డీఏ ఇప్పటికే గెస్ట్ హౌస్ డిజైన్ల కోసం టెండర్లు కూడా పిలిచింది.
Comments
Post a Comment