Skip to main content

ఇప్పట్లో పాఠశాలలు తెరిచే ఆలోచనలేదు: కేంద్రం స్పష్టీకరణ

 

త్వరలోనే దేశంలో అన్ లాక్ 4.0 ప్రక్రియ షురూ కానుంది. తాజా అన్ లాక్ తీరుతెన్నులపై కేంద్ర ఆరోగ్య కార్యదర్శి వివరణ ఇచ్చారు. ఇప్పట్లో పాఠశాలలు తెరిచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ ప్రకటించబోయే ఆంక్షల సడలింపులో స్కూళ్లు ఉండవని వెల్లడించారు. అటు, మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ భావిస్తోంది. ఇప్పటికే దేశీయ విమాన సర్వీసులు, బస్సులు తిరుగుతుండగా, అనేక రాష్ట్రాల నుంచి మెట్రో సేవలపై డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో హోంశాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే, స్కూళ్లు, సినిమా థియేటర్లు, బార్లు తెరుచుకునేందుకు మరికొంతకాలం వేచిచూడకతప్పదు. అన్ లాక్ 4.0 మార్గదర్శకాలను కేంద్రం ఈ నెలాఖరులో విడుదల చేసే అవకాశాలున్నాయి.

Comments