Skip to main content

రమేశ్‌ ఆస్పత్రి ఎండీపై చర్యలు నిలిపివేయండి’ ఏపీ హైకోర్టు ఆదేశం

 విజయవాడలోని స్వర్ణప్యాలెస్‌ అగ్నిప్రమాదం వ్యవహారంలో రమేశ్‌ ఆస్పత్రి ఎండీ, ఛైర్మన్‌పై తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అగ్నిప్రమాదం నేపథ్యంలో తమపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ రమేశ్‌ ఆస్పత్రి యాజమాన్యం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఆస్పత్రి ఎండీ రమేశ్‌బాబు, సీతారామ్మోహన్‌రావు వేర్వేరుగా క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 

స్వర్ణప్యాలెస్‌లో రమేశ్‌ ఆస్పత్రి ఆధ్వర్యంలో కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహించారు. ఈనెల 9న అక్కడ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై విచారణ చేపట్టిన ప్రభుత్వం రమేశ్‌ ఆస్పత్రికి కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ అనుమతులు రద్దుచేసి ఎండీ డాక్టర్‌ రమేశ్‌ బాబు సహా పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో రమేశ్‌బాబు తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. ఏళ్లతరబడి స్వర్ణప్యాలెస్‌ హోటల్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని.. అధికారులు కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ నిర్వహణకు అనుమతి ఇచ్చారని పిటిషనర్‌‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. అనుమతులిచ్చిన అధికారులు కూడా ప్రమాదానికి బాధ్యులే కదా! అని వ్యాఖ్యానించింది. దీనిపై ప్రభుత్వం తరఫు న్యాయవాది స్పందిస్తూ ప్రస్తుతం కేసు విచారణ దశలో ఉందని తెలిపారు. ఇరువురు వాదనలు విన్న అనంతరం డాక్టర్‌ రమేశ్‌బాబు, సీతారామ్మోహన్‌రావుపై తదుపరి చర్యలు నిలిపివేయాలంటూ ఉన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...