Skip to main content

స్వర్ణ ప్యాలెస్‌ బాధితులకు పరిహారం అందజేత

 విజయవాడ స్వర్ణాప్యాలెస్‌ అగ్నిప్రమాద ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. బాధిత కుటుంబాలకు రూ.50లక్షల చొప్పున పరిహారం చెక్కులను రాష్ట్ర మంత్రులు ఆళ్ల నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, కొడాలి నాని, జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌, సామినేని ఉదయభాను తదితరులు అందించారు. 

ఈ సందర్భంగా  వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ... ప్రైవేటు ఆసుపత్రులు అనుమతుల్లేకుండా, భద్రతా ప్రమాణాలు పాటించకుండా కొవిడ్‌కేర్‌ సెంటర్లు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విపత్కర సమయంలో ప్రైవేటు ఆసుపత్రులు తమ స్వార్థం కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం సరికాదన్నారు. ఇప్పటికైనా ప్రైవేటు ఆసుపత్రుల యాజమన్యాలు వైఖరి మార్చుకోవాలని సూచించారు.

Comments