Skip to main content

ఆల్ టైం రికార్డు స్థాయికి బంగారం ధరలు

 

బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి గతంలో ఎన్నడూ లేనంత స్థాయికి బంగారం ధర చేరగా.. ప్రస్తుతం 10 గ్రాముల బంగారం ధర(24 క్యారెట్లు) రూ.58,330కు చేరింది. రెండ్రోజుల వ్యవధిలో రూ.వెయ్యి పెరిగిన బంగారం ధర.. భవిష్యత్తులో రూ 65000 వరకు వెళ్తుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అటు కిలో వెండి ధర రూ.78,300కు చేరింది. ఇంటర్నేషనల్ మార్కెట్‌లో స్పాట్‌ గోల్డ్‌ ఏకంగా 2055 డాలర్ల ఆల్‌టైం హై కి చేరింది. అంతర్జాతీయం అమెరికన్‌ డాలర్‌ కూడా బలహీనపడటం, మదుపరులు పెట్టుబడులు షేర్ మార్కెట్ కంటే బులియన్ మార్కెట్ సేఫ్ గా భావించడంతో బంగారం, వెండి ధరలకు రెక్కలొచ్చాయి. అటు అమెరికా-చైనా ఉద్రిక్తతలు, కరోనా కేసులు పెరుగుతుండటం వంటి కారణాలతో బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికన్‌ డాలర్‌ పుంజుకుంటే బంగారం ధరల్లో కొంత తగ్గుదల నమోదయ్యే అవకాశం ఆశిస్తున్నారు.

Comments