Skip to main content

చైనాపై గూగుల్ ఉక్కుపాదం: 2500 ఛానళ్లు తొలగింపు


కరోనా మహమ్మారికి చైనా అడ్డుకట్ట వేయకపోవడం, ప్రపంచంలో కరోనా మహమ్మారి వ్యాప్తికి చైనా కారణం కావడంతో అమెరికాతో అనేక దేశాలు చైనాను విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.  ఈ విమర్శలను పక్కదోవ పట్టించేందుకు చైనా, ఇండియా బోర్డర్ లో అలజడులు సృష్టించింది.  దీంతో ఇండియా ఆ దేశానికీ చెందిన ఆర్ధిక వ్యవస్థపై దెబ్బకొట్టాలని చూసింది.  ఇందులో భాగంగానే ఒకసారి 59, మరోసారి 47 చైనా యాప్స్ పై నిషేధం విధించింది.  మరో 250 యాప్స్ ను మానిటరింగ్ చేస్తున్నది ప్రభుత్వం.  

ఇక ఇదిలా ఉంటె, ఇప్పుడు గూగుల్ సైతం చైనాపై ఉక్కుపాదం మోపింది.  ఆ దేశానికీ చెందిన 2500 యూట్యూబ్ ఛానల్స్ ను తొలగించినట్టు ప్రకటించింది.  త్రైమాసిక బులెటిన్ ను గూగుల్ ఈ విషయాన్ని పేర్కొన్నది.  స్పామ్, వివాదాస్పద కంటెంట్ ను ఆయా ఛానల్స్ యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నాయని తెలిపింది.  దీంతో ఆయా ఛానల్స్ ను తొలగించినట్టు గూగుల్ పేర్కొన్నది.

Comments