కరోనా ఎఫెక్ట్ బీర్ల అమ్మకాలపై కూడా పడింది. సాధారణ రోజులతో పోలిస్తే కరోనా ఎంట్రీ ఇచ్చినప్పటినుండి బీర్ల అమ్మకాలు తగ్గిపోయాయి. ఈ విషయం తెలంగాణ మద్యం అమ్మకాల లెక్కల ద్వారా భయటపడింది. ఆల్కహాల్ బెవరేజస్‌లో విపరీతంగా అమ్ముడుపోయే ఆల్కహాల్ బీర్ కాగా ఇప్పుడు బీర్లు కొనాలంటేనే భయపడుతున్నారు. చల్లని బీర్లు తాగితే జలుబు రావచ్చనే కారణంగానే వాటిని తాగటానికి మందుబాబులు భయపడుతున్నారని టాక్ వినిపిస్తోంది. తెలంగాణ లోని అన్ని ప్రాంతాల్లో బీర్ల అమ్మకాలు తగ్గాయని షాపు యజమానులు చెబుతున్నారు. మరోవైపు సాధారణ రోజుల్లో జరిగిన పార్టీలు, వేడుకలతో పోలిస్తే ప్రస్తుతం పార్టీలు, వేడుకలు కూడా తగ్గటం మరో కారణమని అంచనావేస్తున్నారు. హైదరాబాద్ లోను గతంతో పోలిస్తే బీర్ల అమ్మకాలు భారీగా తగ్గాయని ఆబ్కారీ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జులైలో 31.48లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరగగా 41.7లక్షల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయి. అయితే ఈ జులైలో 31.34 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు జరగగా బీరు అమ్మకాలు మాత్రం 22.99 లక్షల కేసులు జరిగాయి. ఈ లెక్కలు చూస్తుంటే బీర్ల అమ్మకాలు సగానికి పడిపోయినట్టు తెలుస్తోంది.
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడం, రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ (సీఆర్డీ) రద్దు నేపథ్యంలో.. ప్రభుత్వం మెరుపు వేగంతో నిర్ణయాలను తీసుకుంటోంది. పరిపాలనను వేగవంతం చేసేలా తక్షణ చర్యలకు దిగింది. సీఆర్డీఏ బిల్లు రద్దు అనంతరం దాని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలిని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం.. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఏఎంఆర్డీఏ కమిటీ సభ్యులనూ నియమించింది. సీఆర్డీఏకు బదులుగా ఏఎంఆర్డీఏ సీఆర్డీఏ స్థాయంలో అమరావతి మెట్రోపాలిటన్ ప్రాంత అభివృద్ధి మండలి (ఏఎంఆర్డీఏ)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. సీఆర్డీఏను రద్దు చేస్తూ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోదముద్ర వేసిన మరుసటి రోజే ఏఎంఆర్డీఏను తెరపైకి తీసుకొచ్చింది. దానితో పాటు కొత్త సభ్యులను నియమించింది. మున్సిపల్ శాఖ కార్యదర్శి జే శ్యామల రావు దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను జారీ చేశారు. మొత్తం 11 మంది సభ్యులను ఏఎంఆర్డీఏ కమిటీలో నియమించారు. సభ్యులు వీరే.. మున్సిపల్ శాఖ కార్యదర్శి డిప్య...

Comments
Post a Comment