Skip to main content

జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ సహా 31 మందిపై కేసు నమోదు చేసిన కడప పోలీసులు


కడప జైలు నుంచి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డి నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. జేసీ విడుదల సందర్భంగా కడప జైలు వద్దకు టీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపథ్యంలో కడప జైలు వద్ద కరోనా నిబంధనలు ఉల్లంఘించారంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్, జేసీ పవన్ సహా 31 మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కడప పోలీసులు కేసు నమోదు చేశారు. 


కొవిడ్ నియమావళిని ఏమాత్రం పట్టించుకోలేదన్న కారణంతో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. నిన్న జైలు నుంచి విడుదలైన జేసీ ప్రభాకర్ రెడ్డి అంతలోనే మరో వివాదంలో చిక్కుకున్నారు. కడప నుంచి ఆయన తాడిపత్రికి చేరుకునే క్రమంలో భారీ కాన్వాయ్ తరలి వచ్చింది. దీనిపై తాడిపత్రి సీఐ దేవేందర్ అభ్యంతరం వ్యక్తం చేయగా, జేసీ ఆయనపైకి దూసుకెళ్లడం మీడియాలో కనిపించింది. ఈ అంశంలోనూ జేసీపై కేసు నమోదైంది.  

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here