జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రెండు నియోజక వర్గాల్లో ఓడిపోయారని, జనసేనలో ఒక ఎమ్మెల్యే ఉన్నా లేనట్లేనని ట్వీట్ చేశారు.
'సినీ నటుడు వస్తున్నాడంటే నలుగురూ పోగవుతారు. తమాషా చూద్దామని జనం వస్తే అర్థం పర్థం లేని డైలాగులు దంచుతాడు. పార్టీ నిర్మాణం లేదు, రెండు చోట్లా చిత్తుచిత్తుగా ఓడిపోయాడు. ఒక ఎమ్మెల్యే ఉన్నా లేనట్టే. ప్యాకేజీ కోసం వీధి ప్రదర్శనలిస్తున్నాడు. సానుభూతి చూపడం మినహా ఏం చేస్తాం' అని విజయసాయి రెడ్డి ఎద్దేవా చేశారు.
Comments
Post a Comment