Skip to main content

డ్రీమ్‌ క్యాపిటల్‌ ఎక్కడ కట్టారో చెప్పాలి: బుగ్గన



రాజధాని పర్యటన సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఖండించారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మట్లాడుతూ... చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ‘‘ డ్రీమ్‌ క్యాపిటల్‌ ఎక్కడ కట్టారో చంద్రబాబు చెప్పాలి? ప్రతిసారి ఆయన మాట మారుస్తున్నారు. తాత్కాలిక భవనాలని చంద్రబాబే చెప్పారు. అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు శాశ్వత భవనాలు కడతామని మీరే చెప్పారు. మహిష్మతి కోసం రాజమౌళి సలహాలు తీసుకోవాలని అనుకున్నారు. ఎప్పుడో రాచరికం ఉన్నప్పుడు రాజధాని కేంద్రీకరణ జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా వికేంద్రీకరణ జరుగుతోంది. మహారాష్ట్రలో ముంబయి, తమిళనాడులో చెన్నై, కర్ణాటకలో బెంగళూరుతో పాటు అనేక రగాలు అభివృద్ధి చెందాయి. సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ నిజమే అయితే నెలకో నగరం కట్టొచ్చు. బ్యాంకులు, బాండ్ల ద్వారా రూ.5వేల కోట్లకుపైగా అప్పు తెచ్చారు. ఐదేళ్లపాటు అమరావతిని ఎందుకు నోటిఫై చేయలేదు?రాజధానిలో జరిగిన అన్ని అవినీతి పనులను బయటపెడతాం. అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించేందుకు సమయం పడుతుంది. అమరావతిపై విచారణ చేయాల్సిన అవసరం లేదని మీరెలా చెబుతారు?’’ అని బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు.

Comments

Popular posts from this blog

వారానికోసారి కష్టమేమీ కాదు... సీఎం జగన్‌ కేసులో సీబీఐ కౌంటర్

కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. అక్రమాస్తుల కేసు విచారణ నుంచి తనకు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. సాక్షులను జగన్ ప్రభావితం చేసే అవకాశం ఉందని పిటిషన్‌లో పేర్కొంది. ఆయన వాస్తవాలను దాచిపెట్టి పిటిషన్ వేశారని ఆరోపించింది. జగన్ జైల్లో ఉన్నప్పుడు సాక్షులను ప్రభావితం చేశారని... సీఎం పదవిలో ఉన్న జగన్ సాక్షులను మరింత ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తన పిటిషన్‌లో పేర్కొంది. ఏపీలో రెవెన్యూ లోటు అనేది సీఎంగా ఉన్న జగన్ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చే కారణం కాదని తెలిపింది. సీఎంగా ఉన్న జగన్ విజయవాడ నుంచి వారానికోసారి హైదరాబాద్ రావడంకష్టమేమీ కాదని కౌంటర్‌ పిటిషన్‌లో సీబీఐ పేర్కొన్నట్టు తెలుస్తోంది. సీబీఐ కౌంటర్‌పై కోర్టు శుక్రవారం వాదనలు వినిపించనుంది.

బోటు వెలికితీత మరింత ఆలస్యం

కచ్చులూరు వద్ద మునిగిన బోటును రేపు వెలికితీస్తామని ధర్మాడి సత్యం తెలిపారు. బోటు వెలికితీత కోసం రెండోరోజు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు చెప్పారు. వాతావరణం అనుకూలించనందువల్లే ఈ ఆలస్యం జరుగుతుందని వివరించారు. గోదావరిలో వరద ప్రహహం తగ్గిన కారణంగా బోటును రేపు బయటికి తీస్తామని స్పష్టం చేశారు. కాగా.. ధర్మాడి సత్యం బృందం వేసిన లంగర్‌కు బోటు తగిలి కదిలిందని స్థానికులు తెలిపారు.