Skip to main content

మేము తిట్టిస్తే దారుణంగా ఉంటుంది : కొడాలి



టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని రాజధానిలో తిరుగుతారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఇకనైనా చంద్రబాబు రాజధానిలో డ్రామాలు కట్టిపెట్టాలని సూచించారు. ఆయన బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘మంగళగిరి, తాడికొండలలో టీడీపీ ఓడిపోయినా చంద్రబాబుకి సిగ్గు లేదు. పైగా మాపైకి కుక్కలను పంపి తిట్టిస్తున్నారు. మేము చంద్రబాబు భార్య, తల్లి, అక్కపై విమర్శలు చేయలేదు. కానీ బాబు మా కుటుంబ సభ్యులపై విమర్శలు చేయిస్తున్నారు. మేము తిట్టిస్తే ఇంతకన్నా దారుణంగా ఉంటుంది. చంద్రబాబు వ్యక్తిగతంగా నన్ను, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణను దూషిస్తున్నారు. బాబు నోటికొచ్చినట్టు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తా’మని మంత్రి హెచ్చరించారు.

Comments