Skip to main content

అమరావతిలో బాబుకు నిరసన సెగ



ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పర్యటన సందర్భంగా అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజధాని పేరుతో భూములు దోచుకున్న చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించవద్దంటూ రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మా ప్లాట్లు ఎక్కడున్నాయో చూపించిన తర్వాతే రాజధాని ప్రాంతంలో పర్యటించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. రాజధాని కోసం ల్యాండ్‌పూలింగ్‌ పేరిట చంద్రబాబు పెద్ద ఎత్తున రైతుల నుంచి భూములు సేకరించిన సంగతి తెలిసిందే. అయితే, తమ నుంచి సేకరించిన భూములకు బదులుగా కనీసం ప్లాట్లు కూడా ఇవ్వకపోవడంతో తమ జీవితాలు రోడ్డునపడ్డాయని పలువురు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ నిరసనకు దిగారు. బాబూ.. నీ వల్ల మా బతుకులు బుగ్గిపాలయ్యాయంటూ భగ్గుమంటున్నారు. రైతులకు తీవ్ర ద్రోహం చేసిన చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించవద్దంటూ ఆందోళన చేపట్టారు. పర్యటన సందర్భంగా అమరావతిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాజధాని పేరుతో భూములు దోచుకున్న చంద్రబాబునాయుడు అమరావతిలో పర్యటించవద్దంటూ రైతులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. మా ప్లాట్లు ఎక్కడున్నాయో చూపించిన తర్వాతే రాజధాని ప్రాంతంలో పర్యటించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. రాజధాని కోసం ల్యాండ్‌పూలింగ్‌ పేరిట చంద్రబాబు పెద్ద ఎత్తున రైతుల నుంచి భూములు సేకరించిన సంగతి తెలిసిందే. 
అయితే, తమ నుంచి సేకరించిన భూములకు బదులుగా కనీసం ప్లాట్లు కూడా ఇవ్వకపోవడంతో తమ జీవితాలు రోడ్డునపడ్డాయని పలువురు అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు గోబ్యాక్‌ అంటూ నిరసనకు దిగారు. బాబూ.. నీ వల్ల మా బతుకులు బుగ్గిపాలయ్యాయంటూ భగ్గుమంటున్నారు. రైతులకు తీవ్ర ద్రోహం చేసిన చంద్రబాబు రాజధాని ప్రాంతంలో పర్యటించవద్దంటూ ఆందోళన చేపట్టారు.
అయితే, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులపై టీడీపీ శ్రేణులు గుండాయిజానికి దిగారు. ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన రైతులపై దాడులకు దిగారు. దీంతో అమరావతిలోని వెంకటాయపాలెంలో వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి టీడీపీ కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట చోటుచేసుకుంది.



Comments