Skip to main content

షరతుల్లేవ్‌..రేపే విధుల్లో చేరండి: కేసీఆర్‌



ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్‌ తీపికబురు చెప్పారు. వారికి ఛాన్స్‌ ఇస్తున్నామని.. రేపు ఉదయం అందరూ విధుల్లో చేరాలని స్పష్టం చేశారు. విధుల్లో చేరేందుకు ఎలాంటి షరతులు విధించడం లేవని చెప్పారు. యూనియన్ల కారణంగానే అసంబద్ధ డిమాండ్లతో కార్మికులు ఆర్టీసీ సమ్మెకు దిగారని సీఎం కేసీఆర్‌ అన్నారు. దీంతో వారు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. విపక్షాల మాటలు నమ్మొద్దని.. విధుల్లో చేరాలని తాను స్వయంగా విజ్ఞప్తి చేశానని ఆయన గుర్తు చేశారు. ప్రగతి భవన్‌లో మీడియాతో కేసీఆర్‌ మాట్లాడారు. ఆర్టీసీ సమ్మెకు పూర్తి బాధ్యత యూనియన్లదే అని ఆయన స్పష్టం చేశారు. భాజపా, కాంగ్రెస్‌  ప్రభుత్వాలు ఆయా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారా? అని ప్రశ్నించారు. విపక్ష పార్టీలు లేని ఆశలను కార్మికుల్లో కల్పించాయని మండిపడ్డారు. 

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here