Skip to main content

బీజేపీలోకి పంపించిన ‘కోవర్టు’ను చంద్రబాబు రంగంలోకి దించాడు: విజయసాయి రెడ్డి

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బీజేపీలోకి పంపించిన ‘కోవర్టు’ను చంద్రబాబు నాయుడు ఇప్పుడు రంగంలోకి దించారని పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఎక్కడ జారిపోతుందో అని ఆయనకు భయం పట్టుకుందని విమర్శించారు. అందుకే ‘కోవర్టు’ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బీజేపీతో టచ్ లో ఉన్నారని చెప్పించాడని, అబద్ధానికీ ఒక హద్దుండాలని ట్వీట్ చేశారు.

లులూ గ్రూప్ విషయంపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ... 'లులూ గ్రూప్ కు వైజాగ్ నడిబొడ్డున 14 ఎకరాల భూమిని చంద్రబాబు ఉదారంగా కట్టబెట్టాడు. దీనికి ఎంత కమీషన్ ముట్టిందో త్వరలోనే బయటపడుతుంది. వాళ్ల పెట్టుబడికి అంత భూమి అవసరం లేదని ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై లులూ సంస్థ కంటే చంద్రబాబే ఎక్కువ గుండెలు బాదుకుంటున్నాడు' అని అన్నారు.  

Comments