Skip to main content

బిగ్‌ బ్రేకింగ్: మహా రాజకీయాల్లో ట్విస్ట్.. సీఎంగా దేవేంద్ర..!




మహారాష్ట్ర రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్ నిలిచింది. రాత్రికి రాత్రే.. రాజకీయాల్లో పరిణామాలు మారిపోయాయి. ఎన్సీపీలో చీలికతో మహారాష్ట్ర రాజకీయాల్లో హైడ్రామా నడిచింది. శరత్ పవార్ తమ్ముడు.. అజిత్ పవార్ అనూహ్యంగా బీజేపీకి మద్దతు ప్రకటించడంతో.. ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
మొత్తానికి.. మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 8 గంటలకు రాజ్ భవన్‌లో ఫడ్నవీస్‌చే.. గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రెండోసారి కూడా దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఎన్నికయ్యారు. డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు, డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు..  ప్రధాని నరేంద్రమోదీ, అమిత్ షా శుభాకాంక్షలు తెలియజేశారు.

ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం.. సీఎం ఫడ్నవీస్ మాట్లాడుతూ.. శివసేన ప్రజా తీర్పును అవమానించిందన్నారు. మహారాష్ట్రకు స్థిరమైన ప్రభుత్వం కావాలి.. బలహీన ప్రభుత్వం కాదన్నారు. బీజేపీ-ఎన్సీపీ కలిసి స్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్నారు. స్థిరమైన ప్రభుత్వం కోసమే ఎన్సీపీ బీజేపీకి మద్దతిచ్చిందని పేర్కొన్నారు.

Comments

Popular posts from this blog

ఎలన్ మస్క్... స్టార్ షిప్ రెడీ... వచ్చే ఏడాది మార్స్ చెంతకు ప్రయాణం

మార్స్ గ్రహంపైకి వన్ వే ట్రిప్‌గా ఆసక్తి ఉన్న ప్రజలను పంపుతానని ప్రకటించిన ఆమెరికా బిలియనీర్ వ్యాపారి ఎలన్ మస్క్... అన్నంత పనీ చేస్తున్నారు. మనుషుల్ని చందమామ, మార్స్ చెంతకు తీసుకెళ్లడం కోసం ఆయన కంపెనీ స్పేస్ ఎక్స్... సరికొత్త విమానం తరహా స్పేస్ షిప్‌లను తయారుచేస్తోంది. ఇవి రాకెట్‌‌లా కాకుండా... విమానం లాగా... అంతరిక్షంలోకి వెళ్లి... గ్రహాలపై మనుషుల్ని దించేసి... తిరిగి ఖాళీగా వెనక్కి వచ్చేస్తాయి. గ్రహాలపైకి వెళ్లినవాళ్లు తిరిగి వచ్చే అవకాశాలు లేవు. ఇందుకు రిటర్న్ ట్రిప్ అవకాశం కల్పించట్లేదు ఎలన్ మస్క్. వన్ వే ట్రిప్‌గా వెళ్లేందుకు ఆసక్తి ఉన్నవారే టికెట్ బుక్ చేసుకోమని సూచిస్తున్నారు. తాజాగా ఆయన ఆవిష్కరించిన స్పేస్‌షిప్‌లో వంద మంది ప్రయాణించేందుకు వీలుంది. టెక్సాస్... బోకా చికాలో... ఎంతో మంది అంతరిక్ష ఔత్సాహికులు, రిపోర్టర్ల సమక్షంలో చందమామ, మార్స్‌పైకి పంపే స్టార్ షిప్‌ను ఆవిష్కరించారు ఎలన్ మస్క్. వచ్చే ఆరు నెలల్లో దాన్ని అంతరిక్షంలో ఓ రౌండ్ వేయించి... వచ్చే ఏడాది మనుషులను అందులో పంపాలనుకుంటున్నారు ఎలన్ మస్క్. ఎప్పుడో పదకొండు ఏళ్ల కిందట ఫాల్కన్-1 రాకెట్‌ను తయారుచేసింది స్పేస్ ఎక...

క్రెడిట్ పై పెట్రోలును కొనుగోలు చేస్తే నో క్యాష్‌బ్యాక్‌

క్రెడిట్‌ కార్డులను వినియోగించి పెట్రోలును కొనుగోలు చేస్తే ఇన్నాళ్లూ లభిస్తున్న 0.75 శాతం క్యాష్‌బ్యాక్‌ అక్టోబరు ఒకటో తేది నుంచి ఉండబోదని కంపెనీలు ప్ర‌క‌టించాయి.  2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే డిస్కౌంట్‌ ఇవ్వాలని చమురు కంపెనీలను కోరింది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించడానికి  2016 డిసెంబరు నుంచి క్రెడిట్‌, డెబిట్‌, ఈ-వాలెట్ల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేసే వారికి 0.75శాతం డిస్కౌంట్‌ను క్యాష్‌బ్యాక్‌ రూపంలో  ఇవ్వాల‌ని  చమురు కంపెనీలు క్యాష్‌బ్యాక్‌లను ప్రకటించిన విష‌యం తెలిసిందే. కాగా వచ్చే నెల ఒకటో తేది నుంచి ఆ డిస్కౌంట్‌ ఉండబోదని తాజాగా కంపెనీలు వెల్లడించాయి. ఇకమీదట డెబిట్‌, ఇతర డిజిటల్‌ పద్ధతుల ద్వారా చెల్లించేవారికి మాత్రం ఈ డిస్కౌంట్‌ యధావిధిగా కొనసాగుతుంది.