భవిష్యత్ అంతా శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానానిదేనని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. సైన్స్ అండ్ టెక్నాలజీ సాయం లేకుండా ఏ దేశం అభివృద్ధి చెందిన దాఖలాలు లేవని అన్నారు. ప్రపంచానికి భారత్ ఎందరో గొప్ప సైంటిస్టులను అందించిందని తెలిపారు. కోల్ కతాలో ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం సందర్భంగా మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నూతన ఆవిష్కరణలకు, పరిశోధనలకు తమ ప్రభుత్వం సంస్థాగత సాయం అందిస్తుందని తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి ఎప్పుడూ ఓటమి ఉండదని, ఆవిష్కరణలు, విజయాలే ఉంటాయని అన్నారు. చంద్రయాన్-2 కోసం శాస్త్రవేత్తలు ఎంతో కృషి చేశారని, కానీ వారు అనుకున్నది సాధ్యపడలేదని తెలిపారు. కోరుకున్న ఫలితాలు రాకపోయినా మిషన్ మాత్రం విజయవంతమైందని పేర్కొన్నారు.
Comments
Post a Comment