
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతిరావు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో గొల్లపూడి చికిత్స పొందుతున్నారు. చెన్నై పర్యటనలో ఉన్న వెంకయ్యనాయుడు గొల్లపూడి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. ఆయన ఆరోగ్యపరిస్థితిపై వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. గొల్లపూడి మారుతిరావు వృద్ధాప్య కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ఆయనను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేర్చారు.
Comments
Post a Comment