Skip to main content

మెగా హీరో జోడీగా కైరా అద్వాని


బాలీవుడ్ అందాల తారగా ప్రస్తుతం కైరా అద్వాని ఒక వెలుగు వెలుగుతోంది. వరుసగా హిందీ సినిమాలు చేస్తూనే,  'భరత్ అనే నేను' .. 'వినయ విధేయ రామ' సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. అలాంటి కైరా అద్వాని తాజాగా మరో తెలుగు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.

వరుణ్ తేజ్ హీరోగా అల్లు బాబీ ఒక సినిమాను నిర్మించనున్నాడు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించే ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ఆయన శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ సినిమా కోసం కైరాను సంప్రదించగా, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా చెబుతున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగుకి వెళ్లనుంది.  

Comments