ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ యాంకర్‌గా వెలుగొందుతున్న హాట్ బ్యూటీ అనసూయ. జబర్థస్త్ షోతో ఓ రేంజ్లో పాపులర్ అయిన ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లో కూడా బిజీగా ఉంది. అయితే గ్లామర్ ఫీల్డ్ ఉన్న బ్యూటీ తన వయసు గురించి కామెంట్ చేసేందుకు పెద్దగా ఇష్టపడరు, కానీ ఇటీవల ఓ షోలో పాల్గొన్న అనసూయ తన వయసెంతో బయటపెట్టింది.
న్యూస్ యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చి తరువాత ఎంటర్టైన్మెంట్ యాంకర్‌గా మారిన బ్యూటీ అనసూయ. జబర్దస్త్ షోతో అనసూయ ఇమేజ్ తారా స్థాయికి చేరింది. గ్లామరస్ యాంకర్‌గా కొనసాగుతూనే ఫ్యామిలీ లైఫ్‌ను కూడా ఎంజాయ్ చేస్తోంది అనసూయ. అయితే అందరికీ అనసూయ న్యూస్ యాంకర్‌గా మాత్రమే పరిచయం, కానీ అంతకు ముందే ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన నాగ సినిమాలో చిన్న రోల్ లో నటించింది. అంటే 16 ఏళ్ల కిందే నటిగా వెండితెర మీద అదృష్టాన్ని పరీక్షించుకుంది అనసూయ
ఈ నేపథ్యంలో అనసూయ వయసెంత అన్న అనుమానాలు అభిమానుల్లో ఉన్నాయి. ఈ అనుమానాలపై ఇటీవల ఓ షో ద్వారా క్లారిటీ ఇచ్చింది అనసూయ. ఓ టీవీ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్న అనసూయ షోలో భాగంగా తన వయసు ఎంతో వెల్లడించింది.
Comments
Post a Comment