Skip to main content

టిక్‌టాక్‌కు డెడ్‌లైన్‌ విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్



చైనాకు చెందిన యాప్‌లను నిషేధించాలంటూ అమెరికాలో డిమాండ్ పెరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ సంస్థ కార్యాలయాన్ని వేరే దేశానికి మార్చాలని టిక్‌టాక్‌ ప్రయత్నిస్తుండగా, 


టిక్‌టాక్‌ను కొనుగోలు చేయాలని ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ప్రయత్నాలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌కు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కీలక ప్రకటన చేశారు చేశారు.

తమ దేశానికి చెందిన ఏదైనా కంపెనీకి టిక్‌టాక్‌ను విక్రయించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే ఆ యాప్‌ను అమెరికాలో నిషేధిస్తామని చెప్పారు. టిక్‌టాక్‌ అమెరికా కార్యకలాపాలను తమ దేశానికి చెందిన కంపెనీకి విక్రయించడానికి 6 వారాల గడువు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.

అంటే సెప్టెంబర్ 15వ తేదీ లోపు ఈ ప్రక్రియ ముగియాలని చెప్పారు. టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ లేదా మరో పెద్ద సంస్థకు విక్రయించాలని ఆయన చెప్పారు. భద్రత విషయంలో తమకు ఎలాంటి సమస్య ఉండకూడదన్నారు. ఈ ఒప్పందం నుండి ప్రభుత్వం ఆర్థిక ప్రయోజనం కోరుకుంటుందని తెలిపారు. కాగా, టిక్‌టాక్‌ యాప్ కొనుగోలుకు సంబంధించిన చర్చలను సెప్టెంబర్ 15లోపు పూర్తి చేస్తామని మైక్రోసాఫ్ట్‌ కూడా తెలిపిన విషయం తెలిసిందే.  

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here