Skip to main content

సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వ పిటిషన్ తిరస్కరణ

సర్కార్‌కు సుప్రీం కోర్టులో మరోసారి చుక్కెదురైంది. ఆంగ్లమాధ్యమం విషయంలో హైకోర్టు ఆదేశాలపై స్టే కోరుతూ ఏపీ ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ప్రభుత్వ అభ్యర్థనను తిరస్కరించింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం 81, 85 జీవోలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది కేవీ విశ్వనాథన్‌ వాదనలు వినిపించారు. ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను రద్దు చేయడం సరికాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మాతృభాషలోనే విద్యాబోధన జరగాలని విద్యాహక్కు చట్టంలో లేదని ఆయన కోర్టుకు తెలియజేశారు. ప్రభుత్వ నిర్ణయం ప్రగతిశీల నిర్ణయమని వాదించారు. తెలుగులో బోధన వల్ల పాఠశాలల్లో నమోదు తగ్గిపోతోందని కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై స్పందించేందుకు ప్రతివాదులకు నోటీసులు ఇస్తామని చెప్పింది. నోటీసులతో స్టేకూడా ఇవ్వాలని విశ్వనాథన్‌ ధర్మాసనాన్ని కోరారు.

ప్రతివాదుల తరఫున సీనియర్‌ న్యాయవాది శంకర్‌ నారాయణన్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయంతో తెలుగు మాధ్యమం ఎంపిక అకాశాన్ని కాలరాస్తోందన్నారు. తెలుగు మాధ్యమ పాఠశాలలను కనుమరుగు చేసే యత్నం జరుగుతోందని కోర్టుకు తెలిపారు. ప్రతివాదులు అఫిడవిట్‌ దాఖలు చేసిన తర్వాత స్టేపై పరిశీలిస్తామని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కేవియట్‌ వేసిన విద్యార్థుల తల్లిదండ్రులు, ప్రొఫెసర్లు రెండు వారాల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది. తదుపరి విచారణను సెప్టెంబర్‌ 25కి వాయిదా వేసింది.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...