Skip to main content

తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు... టీఎస్ కు కీలక ప్రతిపాదన చేసిన ఏపీ!

 ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత, తెలంగాణ నుంచి ఏపీకి తిరిగే బస్సుల సంఖ్యతో పోలిస్తే, ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే బస్సుల సంఖ్యే అధికంగా ఉండేదన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా బస్సులు ఆగిపోయిన తరువాత, తిరిగి పునరుద్ధరించాలన్న ఆలోచనలో రెండు రాష్ట్రాలూ ఉన్నప్పటికీ, సమాన కిలోమీటర్ల మేరకు బస్సులను తిప్పేలా అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోవాలని టీఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేస్తూ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు 1.12 లక్షల కిలోమీటర్లు అధికంగా తిరుగుతున్నాయని, ఆ మేరకు తగ్గించుకోవాలని టీఎస్ ఆర్టీసీ అధికారులు కోరారు.


ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు లేఖ వచ్చింది. తాము 56 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, ఆ మేరకు తెలంగాణ బస్సు సర్వీసులను పెంచుకోవాలని ఈ లేఖలో ప్రతిపాదించారు. దీనిపై వెంటనే చర్చించి, బస్సులను నడిపిద్దామని ఈ లేఖలో రవాణా శాఖ చీఫ్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు సూచించారు. దీనిపై ఇంకా టీఎస్ ఆర్టీసీ అధికారులు స్పందించలేదు.  

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.