Skip to main content

నేను కన్నీళ్లు పెట్టుకున్నానని మీడియాలో వస్తున్న వార్తలను ఖండిస్తున్నా: పరుచూరి గోపాలకృష్ణ

 
 

హైదరాబాద్ లో నిర్వహించిన 'మా' సభ్యుల సమావేశం నుంచి సుప్రసిద్ధ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కంటతడి పెట్టుకుని బయటికి వచ్చారంటూ మీడియాలో వార్తలు రావడం తెలిసిందే. నటుడు పృథ్వీ చెప్పడంతో మీడియాలో ఈ విషయం ప్రముఖంగా ప్రసారమైంది. అయితే దీనిపై పరుచూరి గోపాలకృష్ణ స్వయంగా వివరణ ఇచ్చారు. 'మా' సమావేశం నుంచి తాను కంటతడి పెట్టుకుని బయటికి వచ్చినట్టు కొన్ని మీడియా చానల్స్ లో వార్తలు వస్తున్నాయని, వాటిని తాను ఖండిస్తున్నానని అన్నారు. తాను 'మా' సభ్యుల సమావేశానికి హాజరైంది నిజమేనని, అయితే కొందరి సభ్యుల తీరు తనకు నచ్చలేదని, అందుకే బయటికి వచ్చేశాను తప్ప, కంటతడి పెట్టుకున్నాననడంలో వాస్తవంలేదని స్పష్టం చేశారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.