పలు విజయవంతమైన తెలుగు చిత్రాల్లో నటించిన జెనీలియా కూడా కరోనా బారిన పడిందట. ఈ విషయాన్ని తాజాగా ట్విట్టర్ ద్వారా ఆమె వెల్లడించింది. మూడు వారాల క్రితమే తనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయిందని... అయితే, లక్షణాలు లేవని ఆమె తెలిపింది. ఆ తర్వాత 21 రోజుల పాటు తాను ఐసొలేషన్ లో ఉన్నానని చెప్పింది. భగవంతుడి దయ వల్ల తాను కోలుకున్నానని... తాజా టెస్టుల్లో నెగెటివ్ వచ్చిందని తెలిపింది.
వీడియో చూడండి : Click here ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వాహన శ్రేణి అంబులెన్స్కు దారిఇచ్చింది. పులివెందుల నుంచి తిరిగివచ్చిన సీఎం గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి బయల్దేరారు. గూడవల్లి నిడమానూరు మధ్య ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తిని తరలిస్తున్న అబులెన్స్కు దారి ఇచ్చారు. ఉయ్యూరు నుంచి గన్నవరం బైక్పైవెళ్తున్న చాపర్తిన శేఖర్ అనే వ్యక్తి ఉషారామ ఇంజినీరింగ్కాలేజీ సమీపంలో ప్రమాదానికి గురయ్యారు. అతన్ని నేషనల్ హైవే అంబులెన్స్ ద్వారా విజయవాడ ఈఎస్ఐ ఆస్పత్రికి తరలిస్తుండగా, దీనికి ముందు ఉన్న ముఖ్యమంత్రి కాన్వాయ్ పక్కకు తొలగి అంబులెన్స్కు దారి ఇచ్చింది.
Comments
Post a Comment