Skip to main content

చంద్రయాన్‌-2 ఖర్చు ఎంతంటే? వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

 

దిల్లీ: యావత్‌ భారతీయులు గర్వపడేలా ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్‌-2 గురించి లోక్‌సభలో ఆసక్తికర చర్చ నడిచింది. లోక్‌సభ సమావేశాల్లో భాగంగా కేంద్రానికి ఓ ప్రశ్న ఎదురైంది. చంద్రయాన్‌-ఖర్చు, తయారీ వివరాలు చెప్పాల్సిందిగా ఎదురైన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ సమాధానం ఇచ్చారు.
‘దేశంలోని ప్రతి భారతీయుడు గర్వపడేలా ఇస్రో చంద్రయాన్‌-2ను ప్రయోగించింది. జులై 22న GSLV MK III-M1 వాహక నౌక ద్వారా దీన్ని అంతరిక్షంలోకి పంపింది. చంద్రయాన్‌-2 కక్ష్యను పెంచుకుంటూ పోయి 276 x 1,42,975 కి.మీకు చేర్చారు. ఐదు సార్లు కక్ష్యను పెంచారు. సెప్టెంబరు 7న సాఫ్ట్‌ ల్యాండింగ్‌లో భాగంగా విక్రమ్‌ ల్యాండరు చంద్రుడి ఉపరితలం వైపుగా దిగడం మొదలైంది. చంద్రుడి ఉపరితలానికి మరో 500 మీటర్ల దూరంలో ఉండగా ల్యాండరులో సాంకేతిక సమస్యల తలెత్తినట్లు ఇస్రో ఛైర్మన్‌ కె. శివన్‌ ప్రకటించారు. అయినప్పటికీ ఇస్రో శ్రమను తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదు. మన దేశ ఔన్నత్యాన్ని మరింత పెంచే విధంగా శాస్త్రవేత్తలు ఎంతో శ్రమించారు. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ.978కోట్లు ఖర్చయింది’ అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వివరించారు.

Comments

Popular posts from this blog

SSC 2020 మార్కుల మెమో విడుదల

SSC 2020 మార్కుల కోసం ఈ లింక్ click చేయండి http://results20.bseap.org/

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్

వైస్సార్ చేయూత లబ్దిదారుల లిస్ట్ జిల్లాల వారీగా సంఖ్య చూడండి:  Click here