అమరావతిలో ఇళ్ల స్థలాల పంపిణీ, ఆర్5 జోన్ విషయంలో హైకోర్టు ఉత్తర్వులను దేశ సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. హైకోర్టు విచారణ సరిగానే జరిగిందని సీజేఐ బొబ్డే అభిప్రాయపడ్డారు. హైకోర్టులో కేసు తుది విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచించింది.
రాజధాని మాస్టర్ ప్లాన్‌లో మార్పులు చేస్తూ గృహ నిర్మాణ జోన్ (ఆర్-5 జోన్)పై గతంలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటిని హైకోర్టు సస్పెండ్ చేసింది. విచారణ పూర్తయ్యే వరకూ గత ఉత్తర్వులను సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు పేర్కొంది.
Comments
Post a Comment