తమిళ చిత్రరంగంలో దర్శకుడు భాగ్యరాజా ఒక సంచలనం. కొత్త ఒరవడిలో ఆయన రూపొందించిన సినిమాలు అప్పట్లో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో 1983లో ఆయన నుంచి వచ్చిన చిత్రం 'ముందానై ముడిచ్చు' పెద్ద హిట్టయింది. ఊర్వశిని కథానాయికగా పరిచయం చేస్తూ ఆయన రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా అలరించింది. దీంతో దీనిని 'మూడు ముళ్లు' పేరిట జంధ్యాల దర్శకత్వంలో తెలుగులో రీమేక్ చేయగా అది కూడా హిట్టయింది.
ఇక ఇన్నాళ్లకి దీనికి సీక్వెల్ చేసే ప్రయత్నాలను దర్శకుడు భాగ్యరాజా మొదలెట్టారు. శశికుమార్ హీరోగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో కథానాయిక పాత్రకు అనుష్క అయితే పెర్ఫెక్ట్ గా సరిపోతుందని భావించిన భాగ్యరాజా ఆమెను అడిగినట్టు, అయితే, ఆమె తిరస్కరించినట్టు తెలుస్తోంది. ఆమె దీనికి 'నో' చెప్పడానికి కారణం వెల్లడి కానప్పటికీ, పెళ్లిచేసుకుని జీవితంలో సెటిల్ అవ్వాలన్న కారణంతోనే అనుష్క సినిమాలను తిరస్కరిస్తోందని అంటున్నారు.
Comments
Post a Comment