కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈయన కోలుకుంటున్నారని ఆయన కుమారుడు వెల్లడించారు. మరో వారం రోజుల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని చెప్పారు. తన తల్లి మరో మూడు రోజుల్లో కోలుకుంటారని తెలిపారు. మరోవైపు బాలు ఆరోగ్యంపై ప్రధాని మోదీ కార్యాలయం ఆరా తీసినట్టు సమాచారం. ప్రధాని కార్యాలయం అధికారులు ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాలుకు మెరుగైన చికిత్స అందించాల్సిందిగా సూచించారు.
Comments
Post a Comment