ఏపీ మూడు రాజధానుల అంశంపై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దుపై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కోను ఎత్తేయాలంటూ సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది.
అమరావతి రైతుల తరపున సీజేఐ బాబ్డే కుమార్తె రుక్మిణి బాబ్డే వాదనలు వినిపించారు. దీంతో, ఈ కేసును ఇతర బెంచ్ కు బదిలీ చేస్తూ ధర్మాసనం నిర్ణయం తీసుకుంది. తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. మరోవైపు రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టాలపై హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిన సంగతి తెలిసిందే. అమరావతి రైతులు హైకోర్టును ఆశ్రయించగా, గత వారం ఈ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వులను ఈనెల 27వ తేదీ వరకు పొడిగించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది.
Comments
Post a Comment