Skip to main content

నీట్ జేఈఈ పరీక్షలపై సుప్రీం సంచలన తీర్పు !


NEET . JEE  పరీక్షల పై  సుప్రీం కోర్టు తాజాగా  సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. సెప్టెంబర్ లో ఈ రెండు పరీక్షలను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోన్న నేపథ్యంలో సుప్రీం  కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన పిటీషన్లను సుప్రీం కొట్టేసింది.  దీనితో కేంద్రం ప్రకటించిన డేట్స్ లో  వచ్చే నెలలో  నీట్ జేఈఈ పరీక్షలు యధాతథంగా  జరగబోతున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న ఈ పరీక్షలను ఈ సమయంలో  నిర్వహించడం సరికాదని వాటిని వాయిదా వేయాలంటూ 11 రాష్ట్రాలకు చెందిన 11 మంది విద్యార్థులను ఈ నెల 6వ తేదీన పిటీషన్లను సుప్రీం కోర్టులో  దాఖలు చేశారు. ఈ పిటీషన్లు సోమవారం మధ్యాహ్నం సుప్రీంకోర్టు సమక్షానికి విచారణకు వచ్చాయి. ఎన్టీఏ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా విద్యార్థుల తరఫున అడ్వొకేట్ అలఖ్ తమ వాదనలను వినిపించారు. ఈ సందర్భంగా జస్టిస్ అరుణ్ మిశ్రా కీలక వ్యాఖ్యలను చేశారు. విద్యార్థుల తరపున పరీక్షలు వాయిదా వేయాలంటూ అలఖ్ తన వాదనలు వినిపించగా .. జస్టిస్ అరుణ్ మిశ్రా అయన వాదనను తోసిపుచ్చారు.

కరోనా పై పోరాటం చేస్తూ ముందుకు పోవాలని కేవలం వాయిదా వేసినంత మాత్రానా ఈ సమస్య ఇక్కడితో తీరిపోదు. పరీక్షలను వాయిదా వేస్తే .. దేశం చాలా నష్టపోతుందని ఓ విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోతారని అది  దేశానికీ విద్యార్ధులకి అంత మంచిది కాదు అని అరుణ్ మిశ్రా తెలిపారు. నీట్ జేఈఈ పరీక్షలు దేశానికి ఓ మార్గదర్శకాన్ని చేస్తాయని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యుత్తు మాత్రమే కాదు.. దేశం కూడా దానిపై ఆధారపడి ఉందని అరుణ్ మిశ్రా అన్నారు. అలాంటి పరీక్షలను కరోనా కారణంగా వాయిదా వేయాలనుకోవడం సరికాదని అన్నారు. ఈ పిటీషన్లను కొట్టి వేస్తున్నట్లు తెలిపారు. దీనితో సెప్టెంబర్ లో ఈ పరీక్షలు నిర్వహించడానికి కేంద్రం సన్నధం అవుతుంది. 

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...