భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సోము వీర్రాజును
కలిశారు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ఏపీ బీజేపీ అధ్యక్షులుగా బాధ్యతలు
చేపట్టిన సోము వీర్రాజుకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు చిరంజీవి..
పుష్పమాల, శాలువాతో సత్కరించిన చిరంజీవి... జనసేన అధినేత, తన తమ్ముడు
పవన్ కల్యాణ్‌తో కలిసి ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని
సూచించారు.. 2024లో బీజేపీ, జనసేన పార్టీల పొత్తుతో ఉమ్మడిగా అధికారం
చేపట్టాలని ఆకాక్షించారు చిరంజీవి. కాగా, గత ఎన్నికల్లో వామపక్షాలతో
కలిసి ఎన్నికల్లో పోటీచేసిన పవన్ కల్యాణ్.. ఎన్నికల తర్వాత పలు
దఫాలుగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసి.. ఆ
పార్టీకి చేరువైన సంగతి తెలిసిందే.
బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Comments
Post a Comment