సాగర తీరాన నడుచుకుంటూ వెళ్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తోంటే మన మనసు
గాలిలో తేలిపోతున్నట్లు అనిపిస్తుంది. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి చాలా
మంది సాగర తీరానికి చేరుకుంటారు. ఇటువంటి ఆహ్లాదకరమైన వాతావరణం కోసం బీచ్
కు వెళ్లిన ఫిన్లాండ్ వాసులు ఇటీవల అపురూప దృశ్యాలను చూశారు.

కోడి గుడ్ల లాంటి మంచు ముక్కలతో వారు ఫొటోలు దిగి సామాజిక మాధ్యమాల్లో
షేర్ చేశారు. ప్రముఖ ఫోటోగ్రాఫర్ రిస్టో మాటిలా కూడా ఈ అందమైన దృశ్యాలను
కెమెరాలో బంధించి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. వీటికి 'మంచు గుడ్లు'
అని పేరు పెట్టారు.

సముద్ర తీరంలో చోటు చేసుకున్న వాతావరణ మార్పుల కారణంగా భారీ
పరిమాణంలోని మంచు పలకకు ఇలా విడిపోయి చిన్న చిన్న ముక్కలైపోయాయి. అవి
గుండ్రంగా మారి కోడి గుడ్లు, టెన్నిస్ బంతులు, ఫుట్ బాల్స్ పరిమాణంలో
కనపడ్డాయి.
ఇటువంటి అద్భుతమైన దృశ్యాలను తాము ఎన్నడూ చూడలేదని
పర్యాటకులు మీడియాకు తెలిపారు. ఉష్ణోగ్రత భారీగా పడిపోయి సముద్ర ఒడ్డున ఈ
ఆకారాల్లో మంచు ముక్కలు రూపుదిద్దుకున్నాయని చెప్పారు. ఫిన్లాండ్, స్వీడన్
మధ్య ఉన్న ఓ ద్వీపంలో ఈ బీచ్ ఉంటుంది. గతంలోనూ పలు దేశాల్లోని బీచుల్లో
ఇటువంటి దృశ్యాలు అరుదుగా కనపడ్డాయి
Comments
Post a Comment