Skip to main content

శ్రీశైలం డ్యాం భద్రతపై మంత్రి అనిల్ కుమార్ వ్యాఖ్యలు




వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్ర సింగ్ శ్రీశైలం డ్యాం భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. శ్రీశైలం డ్యాం భద్రతకు ఎలాంటి ఢోకా లేదని, డ్యాం నిర్వహణలో అలక్ష్యమంటూ వస్తున్న కథనాల్లో వాస్తవంలేదని స్పష్టం చేశారు.

శ్రీశైలం ప్రాజెక్టు పటిష్టతను అంచనా వేసేందుకు బేతీమెట్రిక్ సర్వే చేయించామని, జలాంతర్భాగాన్ని వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరించామని వెల్లడించారు. దీనిపై నివేదిక వస్తే దాన్నిబట్టి తదుపరి చర్యలు ఉంటాయని, డ్యాంను గ్యాలరీ ఇంజినీరింగ్ విభాగం నిరంతరం తనిఖీ చేస్తుంటుందని వివరించారు. కాగా, డ్యాం భద్రతపై రాజేంద్రసింగ్ సందేహాలు లేవనెత్తిన నేపథ్యంలో మంత్రి అనిల్ కుమార్ సంబంధిత శాఖను ఆదేశించి శ్రీశైలం డ్యాం ప్రస్తుత స్థితిపై నివేదిక తెప్పించుకున్నారు.  

Comments