Skip to main content

ఆర్టీసీపై సాయంత్రం కేసీఆర్‌ కీలక సమీక్ష


ఆర్టీసీ వ్యవహారంపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఈ సాయంత్రం కీలక సమీక్ష నిర్వహించనున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఎలాంటి షరతుల్లేకుండా విధుల్లో చేర్చుకుంటే సమ్మె విరమించి యథాతథంగా విధుల్లో చేరతామంటూ ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నిన్న ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆర్టీసీ వ్యవహారంపై ఉన్నత స్థాయి సమీక్ష కీలకంగా మారింది. ఈ సమీక్షకు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌తో పాటు ఎండీ సునీల్‌ శర్మ, ఇతర ఉన్నతాధికారులు, అడ్వొకేట్‌ జనరల్‌ తదితరులు హాజరుకానున్నారు. 

ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు ఇచ్చిన తీర్పులో ఏయే అంశాలు ఉన్నాయి? హైకోర్టు ఎలాంటి ఆదేశాలిచ్చిందనే అంశంతో పాటు ఐకాస ప్రతిపాదనలపైనా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది. గతంలో కార్మికులు విధుల్లో చేరాలని ముఖ్యమంత్రి రెండుసార్లు విజ్ఞప్తి చేశారు. అయినా కార్మికులు సమ్మె విరమించలేదు. అయితే, ఐకాసనే స్వతహాగా ముందుకొచ్చి విధుల్లో చేరుతామని, షరతుల్లేకుండా కార్మికులను  చేర్చుకోవాలంటూ కోరిన నేపథ్యంలో తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై సీఎం పూర్తిస్థాయిలో సమీక్షించే అవకాశం ఉంది. ఐకాస ఇచ్చిన ప్రతిపాదనలతో పాటు  కార్మికులను విధుల్లో చేర్చుకొనే అంశంపై ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. మరోవైపు, రూట్‌ పర్మిట్ల వివాదంపై హైకోర్టులో శుక్రవారం విచారణ జరగనుంది. అక్టోబర్‌ 5 నుంచి తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే.

Comments

Popular posts from this blog

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.