Skip to main content

అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలిగిన సింగపూర్‌

 
అమరావతి ప్రాజెక్టు నుంచి వైదొలిగిన సింగపూర్‌
 రాజధానిలోని స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధి ప్రాజెక్టు నుంచి వైదొలగుతున్నట్లు సింగపూర్‌ ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం, సింగపూర్‌ కన్సార్షియం పరస్పర అంగీకారంతో ఈ ప్రాజెక్టు నుంచి తాము వైదొలగుతున్నట్లు సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్‌ ప్రకటించారు. స్టార్టప్‌ ప్రాంత అభివృద్ధిపై కొన్ని ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో ప్రాజెక్టును నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం రాత్రి ఏపీ రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సింగపూర్‌ ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. రాజధాని ప్రాంతంలో దాదాపు 1691 ఎకరాల్లో స్టార్టప్‌ ప్రాజెక్టును చేపట్టాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై 2017లో ఒప్పందం కుదిరింది. అయితే ఈ  ప్రాజెక్టు నుంచి తప్పుకోవడం వల్ల తమ పెట్టుబడులపై ఎలాంటి ప్రభావం ఉండదని మంత్రి ఈశ్వరన్‌ స్పష్టం చేశారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో సింగపూర్‌ కంపెనీ పెట్టుబడులపై దీని ప్రభావం ఏమాత్రం ఉండబోదని ప్రకటనలో ఆయన వెల్లడించారు.

Comments