మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరతారంటూ ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ప్రచారం జరుగుతోంది. దీనిపై బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ స్పందించారు. గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. ఒకవేళ గంటా బీజేపీలోకి వస్తే తప్పకుండా స్వాగతిస్తామని మాధవ్ స్పష్టం చేశారు. ఇక, ఇంగ్లీషు మీడియం అంశంపైనా ఆయన మాట్లాడుతూ, మాతృభాషను నేర్చుకునే హక్కును నిర్మూలించడం రాజ్యాంగ ఉల్లంఘన కిందకు వస్తుందని, ఏ ప్రభుత్వమూ ఇలాంటి చర్యలకు దిగరాదని హితవు పలికారు.
Comments
Post a Comment