Skip to main content

రూట్ల ప్రైవేటీకరణ పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు



తెలంగాణలో రూట్ల ప్రైవేటీకరణపై దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలోని 5100 రూట్లకు ప్రైవేటు పర్మిట్లు ఇవ్వాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షుడు పీఎల్‌ విశ్వేశ్వరరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనిపై గత కొన్ని రోజులుగా సుదీర్ఘ విచారణ జరిపిన న్యాయస్థానం ఇవాళ తుది తీర్పు వెల్లడించింది.  


ప్రభుత్వం తరఫున  అడ్వొకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. కేబినెట్‌ నిర్ణయాన్ని గవర్నర్‌ ఆమోదించిన అనంతరం దానికి సంబంధించిన జీవో వచ్చే వరకు కోర్టులు జోక్యం చేసుకోకూడదని, ఎవరూ సవాల్‌
చేయకూడదని ఏజీ వాదనలు వినిపించారు. ప్రభుత్వ నిర్ణయం చట్టబద్ధంగానే ఉందని, ఇందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదనిపేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, తక్కువ ధరకే  ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకే ప్రైవేటీకరణ నిర్ణయమని ఏజీ వివరించారు. పిటిషనర్‌ తరఫున చిక్కుడు ప్రభాకర్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం దురుద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకుందని, చట్టానికి అనుగుణంగా కేబినెట్‌ నిర్ణయం లేదని పేర్కొన్నారు. ‘‘ మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్‌ 102 ప్రకారం  రూట్ల ప్రైవేటీకరణ ప్రక్రియను ప్రారంభించేందుకు అనుమతిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఆ ప్రక్రియ నిర్వహించే బాధ్యతను రాష్ట్ర రవాణా అథారిటీకి అప్పగిస్తున్నట్టు కేబినెట్‌  తీర్మానంలో ఉంది. రాష్ట్ర రవాణా అథారిటీ ఈ ప్రక్రియ ఎలా చేపడుతుంది’’ అని హైకోర్టు ప్రశ్నించింది. రవాణా అథారిటీ అనే పదాన్ని హైకోర్టు తప్పు బట్టింది. రవాణా అథారిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కానీ ప్రైవేటీకరణ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం మే స్వయంగా అమలు చేయాల్సి ఉంటుందని కోర్టు తెలిపింది. రవాణా అథారిటీ బదులురాష్ట్ర రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఈ ప్రక్రియ నిర్వహిస్తారని ఏజీ .. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాంగ్మూలం ఇచ్చారు. ఏజీ వాంగ్మూలాన్ని కోర్టు నమోదు చేసుకుంది. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. పిటిషనర్‌ వాదనలో బలం లేదని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.

Comments

Popular posts from this blog

పవన్ కు శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి

  సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు.  ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.

చింతమనేనికి బెయిల్ నిరాకరణ: అక్టోబర్ 9వరకు రిమాండ్ పొడిగింపు

తెలుగుదేశం పార్టీ నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు కోర్టులో చుక్కెదురు అయ్యింది. చింతమనేనికి బెయిల్ ఇచ్చేందుకు ఏలూరు కోర్టు నిరాకరించింది. అంతేకాదు చింతమనేని రిమాండ్ ను అక్టోబర్ 9 వరకు పొండిగించింది.  2017లో అప్పనపాడు గ్రామంలో స్థల వివాదంలో వ్యక్తిని నిర్బంధించి కులం పేరుతో దూషించిన కేసులో కేసు నమోదు అయ్యింది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో భాగంగా ఇటీవలే చింతమనేని ప్రభాకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.  అనంతరం చింతమనేని ప్రభాకర్ ను ఏలూరులోని ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. రిమాండ్ పూర్తవ్వడంతో బుధవారం పోలీసులు మరోసారి ఏలూరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కోర్టులో హాజరుపరిచారు.  అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తరపు న్యాయవాది సైతం కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చింతమనేని బెయిల్ పిటీషన్ ను న్యాయస్థానం తోసిపుచ్చింది. అనంతరం చింతమనేని రిమాండ్ ను వచ్చే నెల 9 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఏలూరు కోర్టు.  ఇకపోతే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లిన సమయంలో మహిళా పో...