బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న బిగ్ బాస్ సీజన్-3 తుది
అంకానికి చేరుకుంది. ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే జరగనుంది. టైటిల్ కోసం
బాబా భాస్కర్, రాహుల్ సిప్లిగంజ్, వరుణ్ సందేశ్, అలీ, శ్రీముఖి
పోటీపడుతున్నారు. మరోవైపు ఈ సీజన్ విజేత శ్రీముఖి అనే వార్త సోషల్ మీడియాలో
హల్ చల్ చేస్తోంది. తెలుగు బిగ్ బాస్ లో తొలి మహిళా విజేత అంటూ పెట్టిన
ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో బిగ్ బాట్ టైటిల్ ను అందుకున్న
శ్రీముఖిని... హోస్ట్ నాగార్జున ఆప్యాయంగా హత్తుకున్నట్టు ఉంది. ఇందులో ఎంత
వరకు నిజం అనే దాంట్లో క్లారిటీ లేనప్పటికీ... ఈ పోస్ట్ కు జనాల నుంచి
విపరీతమైన స్పందన వస్తోంది. అసలు విజేత ఎవరో తెలియాలంటే మాత్రం ఆదివారం
వరకు ఆగాల్సిందే.
Comments
Post a Comment