Skip to main content

అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అమిత్ షా ఫోన్!

 
 

ఉత్తరప్రదేశ్, అయోధ్యలోని వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు స్థలంపై సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా చర్యలు తీసుకునేందుకు గానూ కేంద్ర హోం మంత్రి అమిత్ షా తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అనంతరం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు.

రాష్ట్రాల్లో తీసుకుంటోన్న చర్యల గురించి ముఖ్యమంత్రులను అమిత్ షా వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. అలాగే శాంతి, భద్రతలను కొనసాగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. అమిత్ షా ఈ రోజు నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఈ తీర్పు వెల్లడైన నేపథ్యంలో ప్రజలంతా శాంతి, సంయమనంతో ఉండాలని కోరుతున్నట్లు అమిత్ షా తెలిపారు.   

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.