Skip to main content

పప్పులాంటి అబ్బాయి' పాట విడుదల చేసి కలకలం రేపిన రామ్ గోపాల్ వర్మ



వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రంలోంచి పప్పులాంటి అబ్బాయి పాటను విడుదల చేశారు. సినిమా టైటిల్ తోనే వేడి పుట్టించిన వర్మ ఇప్పుడు పాటతో మరో వివాదం రేపేలా ఉన్నారు.

'కమ్మ రాజ్యంలో కడప రెడ్లులోని పప్పులాంటి అబ్బాయి పాట ఇదిగో.. ఇది తండ్రీకొడుకుల ప్రేమను తెలిపే పాట. ఇందులో తొలి పార్ట్ తండ్రి కోణంలో, రెండో పార్ట్ కుమారుడి కోణంలో ఉంటుంది. ఈ పాత్రలు ఎవరినైనా పోలి ఉన్నాయని మీకనిపిస్తే ఇది కేవలం యాధృచ్ఛికం మాత్రమే' అని పేర్కొన్నారు.

ఈ సినిమాలోని పలు పోస్టర్ లను ఇప్పటికే వర్మ విడుదల చేశారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పలువురు నేతలను ఉద్దేశించి ఈ సినిమా ఉన్నట్లు వాటి ద్వారా స్పష్టమైంది. ఇప్పటికే ఈ సినిమాపై అనేక వివాదాలు కొనసాగుతున్నాయి.

Comments