అయ్యప్ప మాలధారులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) శుభవార్త చెప్పింది. కార్లు, 12 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న వాహనాలను పంపానది బేస్ క్యాంపు వరకు అనుమతించాలని నిర్ణయించింది. గతేడాది సంభవించిన వరదల కారణంగా పంపానది బేస్ క్యాంపు దెబ్బతినడంతో కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు ప్రస్తుత నీలక్కల్ వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తున్నారు. టీడీబీ తాజా నిర్ణయంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మండల పూజల కోసం గత శనివారం అయ్యప్ప ఆలయం తెరుకుంది. వారం రోజుల్లోనే ఏకంగా 3.5 లక్షల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. మున్ముందు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండడంతో కార్లను పంపానది బ్యాస్ క్యాంపు వరకు అనుమతించాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది.
Comments
Post a Comment