గత రాత్రి పొద్దుపోయిన తరువాత ఎన్సీపీ అధినేత శరద్ పవార్, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రేలతో సమావేశం అయ్యారు. వీరి భేటీలో ఏఏ అంశాలపై చర్చలు సాగాయన్న విషయంలో అధికారిక ప్రకటన వెలువడనప్పటకీ, కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మంత్రి పదవుల పంపకం తదితరాలపైనే చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. కాగా, మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఎన్సీపీ, శివసేన పార్టీల మధ్య ఇప్పటికే ఒప్పందం కుదరగా, కాంగ్రెస్ కూడా మద్దతిచ్చేందుకు సానుకూలతను తెలిపింది.
శరద్ పవార్, ఉద్ధవ్ ల సమావేశంలో సంజయ్ రౌత్ కూడా పాల్గొనడంతో, నేడు మూడు పార్టీలూ కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై అధికారిక ప్రకటన వెలువడుతుందని తెలుస్తోంది. ఆదివారంలోగా మహారాష్ట్ర్రలో శివసేన నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని ఆ పార్టీ నేతలు గట్టిగానే చెబుతున్నారు. నిన్న జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అత్యున్నత విధాన నిర్ణయక మండలి సమావేశంలో శివసేన, ఎస్పీపీలతో కలిసేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అంగీకరించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శివసేన, ఎన్సీపీలు చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి పదవిని పంచుకుంటే, కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్లూ ఉప ముఖ్యమంత్రి పదవి దక్కనుంది.
Comments
Post a Comment