Skip to main content

వేచి చూసే ధోరణిలో భాజపా మహారాష్ట్రలో మళ్లీ తమకే అవకాశం వస్తుందని ఆశలు..!

 వేచి చూసే ధోరణిలో భాజపా
 మహారాష్ట్రలో అధికార బంతి చివరకు ఎన్‌సీపీ కోర్టుకు చేరింది. గవర్నర్‌ ఇచ్చిన గడువులోగా శివసేన ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టలేకపోవడంతో ఎన్‌సీపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారు. అయితే ఈ పరిణామాలన్నింటినీ భాజపా నిశితంగా పరిశీలిస్తోంది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేయలేమని చెప్పి బంతిని సేన కోర్టులోకి నెట్టిన భాజపా తిరిగి అది తమ మైదానంలోకే వచ్చి చేరుతుందని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే భాజపా వేచి చూసే ధోరణి అవలంబిస్తోందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ నివాసంలో సోమవారం పార్టీ పలు దఫాల్లో చర్చలు జరిపింది. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్‌, ఎన్‌సీపీ మద్దతు కూడగట్టేందుకు శివసేన చేసిన ప్రయత్నాల్ని నిశితంగా గమనించింది. ఈ సమావేశాల అనంతరం భాజపా సీనియర్‌ నేత సుధీర్‌ మునగంటివార్ మాట్లాడుతూ..‘‘మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాల్ని నిశితంగా గమనిస్తున్నాం. సరైన సమయంలో మేం ఓ నిర్ణయం తీసుకుంటాం. అప్పటి వరకు వేచి చూడడమే మా పని’’ అని వ్యాఖ్యానించారు.
అయితే భాజపా పార్టీ వర్గాలు మాత్రం రాష్ట్రపతి పాలన రావాలని కోరుకుంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎన్‌సీపీ సహా సేనలోని కొంతమంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు భాజపా ప్రయత్నించే అవకాశం వస్తుందని వారు భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఓ పార్టీకి చెందిన సీనియర్‌ నేత మాట్లాడుతూ..‘‘శివసేనతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ అంగీకరించదని మా పార్టీ(భాజపా) బలంగా విశ్వసిస్తోంది. ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే రాష్ట్రపతి పాలన అనివార్యం. అదే జరిగితే ప్రభుత్వ ఏర్పాటుకు ఉన్న అన్ని అవకాశాల్ని పరిశీలిస్తాం. ఒకవేళ ఎన్‌సీపీ, కాంగ్రెస్‌, శివసేన కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది సంవత్సరానికి మించి నిలబడదు’’ అని అభిప్రాయపడ్డారు. మరోవైపు పార్టీ కోర్‌ కమిటీలోని ఓ సీనియర్‌ నేత ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఎట్టిపరిస్థితుల్లో ఇక శివసేనతో కలిసేది లేదని’ అన్నారు. ‘‘శివసేనతో కలిసి నడిచే ప్రసక్తే లేదు. అయితే ఆ పార్టీలోని 25 ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. శివసేన వ్యవహరిస్తున్న తీరుతో ఆ పార్టీలో కొంతమంది అంసతృప్తిగా ఉన్నారు. మంగళవారం సాయంత్రానికి అన్ని విషయాలు ఓ కొలిక్కి వస్తాయి’’ అని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం తిరిగి తమకే రావొచ్చని భాజపా భావిస్తున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి.
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో సోమవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఎన్‌సీపీ, కాంగ్రెస్‌ మద్దతు కోసం శివసేన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ ప్రభుత్వ ఏర్పాటుకు మూడో అతిపెద్ద పార్టీ అయిన ఎన్‌సీపీని ఆహ్వానించారు. మంగళవారం రాత్రి 8.30 గంటల్లోగా సంసిద్ధత వ్యక్తం చేయాలని ఆ పార్టీకి గడువు విధించారు. ఈ పరిణామాల నేపథ్యంలో నేడు రాజకీయ సమీకరణాలు ఎలా మారబోతున్నాయన్న దానిపై ఆసక్తి నెలకొంది. 

Comments

Popular posts from this blog

రేపు బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధికి సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ రేపు దసరా ఉత్సవాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఈ మేరకు జగన్ షెడ్యూల్ లో మార్పులు చేశారు. ఎల్లుండి ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం, ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలోని ఓంకారం వద్ద రాష్ట్ర మంత్రులు సీఎంకు స్వాగతం పలుకుతారు. ఆపై అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. కాగా, సీఎం జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. ఇక జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.

ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదు: రేవంత్ రెడ్డి

  కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తాజాగా కృష్ణా నది యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంను కలిసి నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంపై వినతిపత్రం ఇచ్చారు. హైదరాబాదులోని జలసౌధ కార్యాలయానికి వెళ్లిన రేవంత్ రెడ్డి, జీవో 69 ద్వారా మంజూరు చేసిన నారాయణపేట-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను అపెక్స్ కౌన్సిల్ అజెండాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం ఉమ్మడి రాష్ట్రంలో అన్ని అనుమతులు పొందిందని, ఎంతో తక్కువ ఖర్చుతో నికర జలాలను ఇవ్వగలిగిన ఈ ప్రాజెక్టును తొక్కిపెట్టి మీరు సాధించిందేమిటి? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో మీరు వేసిన కేసులోనూ ఈ ప్రాజెక్టు వివరాలు పొందుపరచకపోవడం మీ దుర్మార్గానికి పరాకాష్ఠ అంటూ మండిపడ్డారు. అంతేకాదు, ఈ ప్రాజెక్టు ఏపీ పునర్విభజన చట్టం పరిధిలోకి రాదని, పొరుగు రాష్ట్రాలేవీ దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని రేవంత్ స్పష్టం చేశారు.