Skip to main content

ముహూర్తానికి ముందు ఫంక్షన్ హాల్ లో పెళ్లి కొడుకు ఆత్మహత్య

 

పెళ్లికి వచ్చిన బంధువులు, మిత్రులతో ఆ ఫంక్షన్ హాల్ అంతా సందడి నెలకొంది. ముహూర్తానికి సమయం దగ్గరపడుతోందని తొందర మొదలైంది. అంతలోనే అదే వేడుకలో విషాదం నిండుకుపోయింది. ఫంక్షన్ హాల్ లోని గదిలోనే పెళ్లి కుమారుడు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

ఈ విషాద ఘటన మేడ్చల్ జిల్లాలో చోటు చేసుకుంది. పెళ్లి ముహూర్తానికి ముందు వరుడు సందీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొంపల్లిలోని ఫంక్షన్ హాల్ లో చోటు చేసుకున్న ఈ ఘటనపై బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయంపై ఆరా తీస్తున్నారు.   

Comments