Skip to main content

వేదికపైకి పిలిచి ధర్మాడి సత్యానికి శాలువా కప్పిన సీఎం జగన్




కొన్నినెలల క్రితం గోదావరిలో రాయల్ వశిష్ట బోటు మునిగిపోవడం ఏపీ చరిత్రలో మాయనిమచ్చలా మిగిలిపోయింది. అయితే, ఆ బోటును ఎంతో వ్యయప్రయాసల కోర్చి వెలికితీసిన ధర్మాడి సత్యం బృందంపై ప్రశంసల వర్షం కురిసింది. తాజాగా, ధర్మాడి సత్యాన్ని ఏపీ సీఎం జగన్ సన్మానించారు. ఇవాళ ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా సీఎం జగన్ తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మత్స్యకార భరోసా పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ధర్మాడి సత్యం తన బృందంతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా ధర్మాడి సత్యాన్ని వేదికపైకి పిలిచిన సీఎం జగన్ ఆయనకు శాలువా కప్పి సత్కరించారు. గోదావరి నుంచి బోటును వెలికితీసినందుకు అభినందనలు తెలియజేశారు. ధర్మాడి బృందంలోని సభ్యులను కూడా ఆయన అభినందించారు.  

Comments