టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు
మిథున్ రెడ్డి, రఘురామ కృష్ణంరాజులు లోక్‌సభ జనరల్ పర్పస్ కమిటీ
సభ్యులుగా నియమితులయ్యారు. లోక్‌సభ స్పీకర్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ
కమిటీలో మొత్తం 45 మంది సభ్యులు ఉన్నారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
ప్రహ్లాద్ జోషి, ఆ శాఖ సహాయ మంత్రులు అర్జున్‌రాం మేఘవాల్,
వి.మురళీధరన్‌లు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నారు. టీఆర్ఎస్ ఎంపీ నామా,
వైసీపీ ఎంపీలను కమిటీ సభ్యులుగా నియమించినట్టు శనివారం లోక్‌సభ సచివాలయం
బులెటిన్ విడుదల చేసింది.
సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు పుట్టినరోజు వేడుక జరుపుకుంటోన్న నేపథ్యంలో ఆయనకు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలిపారు. ఆయనకు మహేశ్ బాబుతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో పవన్ కల్యాణ్ అద్భుత విజయాలు సాధించాలని తాము కోరుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Post a Comment