Skip to main content

గవర్నర్ ను కలిసి రాజీనామా సమర్పించిన సీఎం ఫడ్నవీస్




మీడియా ఎదుట రాజీనామా ప్రకటన అనంతరం.. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ భగత్ సింగ్ కొష్యారీని కలిశారు. తన రాజీనామా లేఖను ఆయనకు సమర్పించారు. నిజానికి ఫడ్నవీస్ రేపు తమ మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంది. అంతకు ముందే నాటకీయ పరిణామాల నేపథ్యంలో తాను రాజీనామా చేస్తున్నట్లు  ఫఢ్నవీస్ ప్రకటించారు. శివసేన తమను మోసం చేసిందని మీడియాతో భేటీలో విమర్శించారు.   

Comments