Skip to main content

ఏ రాష్ట్రమూ ఇంత దగా పడలేదు: జగన్‌

 

ఏ రాష్ట్రమూ ఇంత దగా పడలేదు: జగన్‌
 ఆంధ్రరాష్ట్రం కోసం ఎందరో మహానుభావులు పోరాడారని.. పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారని సీఎం జగన్‌ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత దగా పడలేదన్నారు. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన రాష్ట్రావతరణ వేడుకల్లో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్, స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌, పలువురు మంత్రులతో కలిసి సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ ఐదేళ్ల తర్వాత రాష్ట్రావతరణ వేడుకలు జరుపుకోవడం గర్వకారణంగా ఉందని చెప్పారు. పదేళ్లుగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించుకోవాల్సిన అవసరముందన్నారు. భవిష్యత్‌ తరాలు బాగుపడేలా నవరత్నాల పథకాలను అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. విద్య, వైద్యం, పారిశ్రామిక రంగాలు బాగుపడేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ఆయన వివరించారు. కష్టాల తర్వాత మంచి రోజులు కూడా వస్తాయని నిరూపించుకుందామన్నారు. రాష్ట్రాభివృద్ధిలో అందరూ కలిసి రావాలని జగన్‌ పిలుపునిచ్చారు. 
ఈ రాష్ట్రానికి గవర్నర్‌గా ఉండటం నాకు గర్వకారణం
గొప్ప సంస్కృతి ఉన్న రాష్ట్రానికి గవర్నర్‌గా ఉండటం గర్వంగా ఉందని గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ అన్నారు. పల్లవులు, చాళుక్యులు పాలించిన గొప్ప నేల ఆంధ్రప్రదేశ్‌ అని.. స్వాతంత్ర్యోద్యమంలో ఈ రాష్ట్రానిది కీలక పాత్ర అంటూ కొనియాడారు. ఎంతో మంది మహానుభావులు స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నారని గుర్తు చేసుకున్నారు. అల్లూరి సీతారామరాజు ఆంగ్లేయుల పాలిట సింహ స్వప్నమయ్యారని చెప్పారు. విజయవాడ నగరాన్ని మహాత్మాగాంధీ ఆరుసార్లు సందర్శించారని గవర్నర్‌ గుర్తు చేశారు. విజయవాడ వాసి పింగళి వెంకయ్య జాతీయ పతాకాన్ని రూపొందించి గర్వకారణంగా నిలిచారని బిశ్వభూషణ్‌ కొనియాడారు.

Comments

Popular posts from this blog

సుజనా చౌదరి లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా ప్రైవేట్ బిల్లు పెడతాం: వైసీపీ ఎంపీ బాలశౌరి

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై వైసీపీ ఎంపీ బాలశౌరి తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సుజనాచౌదరి బీజేపీలో చేరింది చంద్రబాబు అజెండా మోయడానికి కాదా? రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమా? చంద్రబాబు ప్రయోజనాలు ముఖ్యమా? ప్రధాని మోదీకి వ్యతిరేకంగా గతంలో ధర్మదీక్షలు చేసింది సుజనా కాదా? అని ప్రశ్నించారు. పొలిటికల్ బ్రోకర్, డూప్లికేట్ బీజేపీ నేత సుజనా చౌదరి మాటలకు విలువే లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుజనా డూప్లికేట్ బీజేపీ నేత కాబట్టే చంద్రబాబు అజెండా అమలు చేస్తున్నారని ఆరోపించారు. సుజనాపై ఎథిక్స్ కమిటీలో ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.  బ్యాంకులను మోసం చేసి డబ్బులు ఎగ్గొట్టిన సుజనా లాంటి వాళ్లు చట్టసభల్లోకి రాకుండా పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.  

తెలంగాణ సర్కారుకు దర్శకుడు హరీశ్ శంకర్ సలహా

  హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి మంత్రి కేటీఆర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేయగా, దానిపై దర్శకుడు హరీశ్ శంకర్ స్పందించారు. హైదరాబాద్ నగరానికి స్లిప్ రోడ్ల అవసరం ఎంతో ఉందని తెలిపారు. మంత్రి కేటీఆర్ సమావేశంలో కొత్త స్లిప్ రోడ్ల అంశం కూడా చర్చకు రాగా, తక్షణ అవసరం అదేనని హరీశ్ శంకర్ అభిప్రాయపడ్డారు. హరీశ్ ప్రతిపాదనకు నెటిజన్ల నుంచి గణనీయమైన స్థాయిలో మద్దతు లభిస్తోంది.